తమిళంలో చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్‌ను సొంతం చేసుకున్న మూవీ 'టూరిస్ట్ ఫ్యామిలీ'. శశికుమార్, సిమ్రాన్ ప్రధాన పాత్రల్లో నటించగా.. యోగి బాబు, మిథున్ జై శంకర్, కమలేశ్ జగన్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. అభిషాన్ జీవింత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 1న ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు, పలువురు సెలబ్రిటీలు చాలా బాగుందని ప్రశంసిస్తున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్, నటుడు శివకార్తికేయన్ ఈ సినిమా చూసి చిత్రబృందాన్ని ప్రత్యేకంగా పిలిపించుకుని అభినందించారు. అలాగే దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, నటుడు సూర్య కూడా మూవీని మెచ్చుకున్నారు. తాజాగా నేచురల్ స్టార్ నాని సైతం 'టూరిస్ట్ ఫ్యామిలీ' చిత్రంపై ప్రశంసల జల్లు కురిపించారు. ఈ మేరకు ఆయన 'ఎక్స్' వేదికగా ప్రత్యేకంగా పోస్టు పెట్టారు. "సింపుల్‌గా ఉండి, హృదయపూర్వకంగా.. ఎంతో మంచిని పంచే సినిమాలు మనకు కావాలి. 'టూరిస్ట్ ఫ్యామిలీ' అలాంటి చిత్రమే. ఈ అద్భుతమైన సినిమాను రూపొందించిన నటీనటులకు, చిత్రబృందానికి ధన్యవాదాలు. ఇది చాలా అవసరం" అంటూ నాని రాసుకోచ్చాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa