“నేనూ, నా కుటుంబం ఉగ్రవాద బాధితులమే. 32 ఏళ్లుగా ఈ బాధను అనుభవిస్తున్నాం” అని బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ భావోద్వేగంగా చెప్పారు. ఇటీవల జరిగిన పహల్గాం ఉగ్రదాడి తమను తీవ్రంగా కలచివేసిందని అన్నారు. ఓ నూతన వధువు తన భర్త మృతదేహం వద్ద విలపిస్తున్న దృశ్యం తనలో తీవ్రమైన కోపాన్ని రగిల్చిందని పేర్కొన్నారు. ఎంతో మంది జీవితాలు ఉగ్రవాదం వల్ల నష్టపోతున్నాయని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa