సూపర్ స్టార్ మహేష్ బాబు యొక్క 15 ఏళ్ల చిత్రం 'ఖలేజా' గ్రాండ్ రీ-రిలీజ్ అయ్యింది. అభిమానులు థియేటర్లలో మరోసారి ఆనందం అనుభవించడానికి చాలా సంతోషిస్తున్నారు. అనేక ఇతర ప్రాంతాలలో ప్రతిస్పందన చాలా సానుకూలంగా ఉంది. తాజాగా ఇప్పుడు ఈ చిత్రం విడుదలైన తొలి రోజున వరల్డ్ వైడ్ గా 8.26 కోట్ల గ్రాస్ ని రాబట్టినట్లు సమాచారం. ఈ విషయాని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు. త్రివిక్రమ్ దర్శకత్వం మరియు అనుష్క శెట్టిని హీరోయిన్‌గా నటించిన ఖలేజా మొదట విడుదలైనప్పుడు మిశ్రమ స్పందన వచ్చింది. కాని కాలక్రమేణా ఇది కల్ట్ హోదాను సంపాదించింది. ఈ సినిమాలో కోట శ్రీనివాస్ రావు, అలీ, సునీల్, బ్రహ్మానందం, సుబ్బరాజు, రఘు బాబు మరియు ఇతరులు కీలక పాత్రలలో నటించారు. మణి శర్మ ఈ సినిమాకి ట్యూన్స్ కంపోజ్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa