యువ నటి శ్రీలీల ఇటీవల కొన్ని ఫొటోలు షేర్ చేయగా.. అవి నిశ్చితార్థం ఫొటోలని పలువురు ప్రచారం చేశారు. వీటిపై ఆమె స్పష్టతనిచ్చారు. ‘నా ప్రీ బర్త్ డే వేడుకలను ఇంట్లోనే మేము ఈ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాం. దీనికి సంబంధించిన ప్లానింగ్ అంతా మా అమ్మ చూసుకున్నారు’ అని ఆమె రాసుకొచ్చారు. ఈ వేడుకల్లో రానా సతీమణి మిహిక కూడా పాల్గొన్నారు. ఇందులో శ్రీలీల చీరకట్టులో కనిపించారు. జూన్ 14న ఆమె 24వ పుట్టినరోజు చేసుకోనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa