బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరు భార్య శ్యామలి మరోసారి సోషల్ మీడియాలో వైరల్ పోస్ట్ పెట్టారు. 'కాలం అన్నింటినీ బయటపెడుతుంది. కర్మ సమాధానం చెబుతుంది. ఈ విశ్వం దీనిని నిశితంగా చూస్తుంటుంది' అని రాసి ఉన్న సందేశాన్ని ఇన్‌స్టా స్టోరీస్‌లో పంచుకున్నారు. దీనికి కర్మ, నువ్వు ఏం ఇస్తావో అదే నీకు తిరిగి వస్తుంది అనే హ్యాష్‌ట్యాగ్స్‌ను జత చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ చర్చలకు దారి తీస్తోంది. సమంత, రాజ్‌ను ఉద్దేశించి పెట్టినట్లు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa