ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కారు ప్రమాదంపై స్పందించిన తరుణ్‌

cinema |  Suryaa Desk  | Published : Tue, Aug 20, 2019, 11:07 AM

సినీనటుడు తరుణ్‌ కారు ప్రమాదానికి గురైందని తెగ వార్తలు వస్తున్నాయి. రంగరెడ్డి జిల్లా అల్కాపురి టౌన్‌షిప్‌ వద్ద ఔటర్‌ రింగు రోడ్డుపై మంగళవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగిందనీ.. కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొందని ప్రచారం జరిగింది. ప్రమాద సమయంలో కారులో నటుడు తరుణ్‌ ఉన్నారంటూ.. అయితే ఈ ప్రమాదంలో అతడికి ఎటువంటి గాయాలు కాలేదని, ప్రమాదం అనంతరం తరుణ్‌ కారును అక్కడే వదలేసి వెళ్లిపోయారని వార్తలు వస్తున్నాయి.  


ఈ వార్తలపై తరుణ్‌ అధికార ప్రతినిధి తాజాగా స్పందించారు. ఆ వార్త అవాస్తవమని కొట్టిపడేశారు. యాక్సిడెంట్‌ అయిన కారుకు తరుణ్‌కు ఎటువంటి సంబంధంలేదని స్పష్టం చేశారు. గత రాత్రి నుంచి ఆయన ఇంటి వద్దే ఉన్నారని తెలిపారు. కారు కూడా బాగానే ఉందని పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa