పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన మూవీ ‘హరిహర వీరమల్లు’. ఈ సినిమా తొలి భాగం జూన్ 12న విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రచారాన్ని వేగవంతం చేస్తోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చిత్రబృందం సిద్ధమవుతోంది. తిరుపతిలోని ఎస్వీయూ తారకరామ క్రీడా మైదానంలో ఈ నెల 8న వేడుక నిర్వహించనున్నారు. 7వ తేదీన పవన్ తిరుపతికి చేరుకోనున్నారు. తిరుమల శ్రీవారిని ఆయన దర్శించుకునే అవకాశం ఉన్నట్టు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa