వకీల్ సాబ్ ఫేమ్ వేను శ్రీరామ్ దర్శకత్వంలో నటుడు నితిన్ ఒక చిత్రాన్ని ప్రకటించాడు. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'తమ్ముడు' అనే టైటిల్ ని లాక్ చేసారు. నితిన్ ఈ చిత్రంలో ఒక ప్రొఫెషనల్ ఆర్చర్ పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రం జూలై 4, 2025న గ్రాండ్ రిలీజ్ కానున్నట్లు మేకర్స్ గతంలో ప్రకటించారు. తాజాగా ఇప్పుడు లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, చిత్ర బృందం ఈ సినిమా విడుదలని జులై 25 కి వాయిదా వేస్తున్నట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు మేకర్స్ ఈ వార్త పై స్పందించలేదు. రానున్న రోజులలో ఈ విషయం పై మూవీ టీమ్ క్లారిటీ ఇవ్వనుంది. ఈ చిత్రంలో సప్తమి గౌడ మహిళా ప్రధాన పాత్రలో నటిస్తుంది. లయ, లబ్బర్ పాంధు ఫేమ్ స్వాసికా, వర్ష బోల్లమ్మ మరియు సౌరాబ్ సచదేవా కీలక పాత్రలలో నటిస్తున్నారు. దిల్ రాజు మరియు షిరిష్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ఈ ప్రాజెక్టును బ్యాంక్రోలింగ్ చేస్తున్నారు. అజనీష్ లోక్‌నాథ్ సంగీతాన్ని కంపోజ్ చేస్తున్నారు. తమ్ముడు సినిమాటోగ్రాఫర్ కెవి గుహన్, మ్యూజిక్ కంపోజర్ బి అజనీష్ లోక్‌నాథ్ మరియు ఎడిటర్ ప్రవీణ్ పూడితో సహా ప్రతిభావంతులైన సాంకేతిక బృందాన్ని కలిగి ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa