ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'కుబేర' నార్త్ అమెరికా రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్

cinema |  Suryaa Desk  | Published : Fri, Jun 06, 2025, 08:31 AM

కోలీవుడ్ నటుడు ధనుష్ తన తదుపరి చిత్రాన్ని శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. చివరి నిర్మాణ దశలో ఉన్న ఈ చిత్రానికి మేకర్స్ 'కుబేర' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ చిత్రం జూన్ 20న తమిళం, తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానుంది. తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క నార్త్ అమెరికా థియేటర్ రైట్స్ ని ప్రత్యంగిరా సినిమాస్ బ్యానర్ సొంతం చేసుకున్నట్లు ప్రకటించారు. ఈ సినిమా ప్రీమియర్ జూన్ 19న ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు. ఈ చిత్రంలో రష్మిక మందన్న మహిళా ప్రధాన పాత్రలో నటిస్తుంది. ఈ చిత్రంలో నాగార్జున, జిమ్ సర్భ్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి కెమెరా హ్యాండిల్ నికేత్ బొమ్మి, ఎడిటింగ్ కార్తీక శ్రీనివాస్ అందిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి మరియు అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకాలపై సునీల్ నారంగ్ మరియు పుస్కుర్ రామ్ మోహన్ రావు భారీ బడ్జెట్‌తో భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కుబేర 120 కోట్ల భారీ బడ్జెట్‌తో అత్యంత ఖరీదైన ప్రాజెక్ట్‌గా చెప్పబడుతోంది. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa