భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయిన యంగ్ బ్యూటీ కియారా అద్వానీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.తన ఫస్ట్ మూవీతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే తన అందం, నటనతో ప్రేక్షకుల మనసులు దోచుకుంది. దీంతో ఈ భామకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా వచ్చిన అవకాశాలను సద్విని యోగం చేసుకుంటూ ప్రస్తుతం హీరోయిన్‌గా రాణిస్తుంది. రీసెంట్‌గా ఈ ముద్దుగుమ్మ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'గేమ్ ఛేంజర్' సినిమాతో మన ముందుకు వచ్చింది.సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ అయి డిజాస్టర్‌గా నిలిచింది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఒకటి రెండు సినిమాలతో బిజీగా ఉన్నట్లు టాక్. ఇక ఈ అమ్మడు వ్యక్తిగత విషయానికి వస్తే.. కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే బాలీవుడ్ స్టార్ హీరో సిద్ధార్ధ్ మల్హోత్ర తో డేటింగ్‌లో ఉంటై 2023లో పెళ్లి చేసుకుంది. ఇక అప్పటినుంచి ఓ పక్క సినిమాలతో మరో పక్క భర్తతో ఫ్యామిలీ లైఫ్‌ను బ్యాలెన్స్ చేస్తూ వస్తుంది. అలాగే నిత్యం సోషల్ మీడియా లో యాక్టీవ్‌గా ఉంటూ లేటెస్ట్ ఫొటో షూట్స్‌తో పాటు వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది.
అయితే ఈ ముద్దుగుమ్మ తల్లి కాబోతున్న సంగతి తెలిసిందే. ఇక అప్పటి నుంచి ఈ అమ్మడుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో మరో పిక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైరల్ అవుతున్న ఫొటోలో.. కియారా పెద్ద బేబీ బంప్‌తో దర్శనమిచ్చింది. వైట్ కలర్ డ్రెస్‌లో ఈ చిన్నది చాలా అందంగా కనిపిస్తుంది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు సో బ్యూటిఫుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa