ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు మళ్లీ ప్రారంభం కానున్న 'ఉస్తాద్‌ భగత్‌సింగ్‌' చిత్రీకరణ

cinema |  Suryaa Desk  | Published : Tue, Jun 10, 2025, 08:24 PM

నటుడు పవన్‌ కల్యాణ్‌, అటు రాజకీయ బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఇటు పూర్తి చేయాల్సిన సినిమాలపైన దృష్టిపెట్టారు. ఇటీవల ఓ షెడ్యూల్‌తో హరిహర వీరమల్లు చిత్రాన్ని పూర్తి చేశారు. తదుపరి ఓజీ సినిమా కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తి చేశారు. ఇప్పుడు 'ఉస్తాద్‌ భగత్‌సింగ్‌' వంతు వచ్చింది. హరీశ్‌ శంకర్‌ దర్శకత్వంలో ఎప్పుడో ప్రారంభమైన ఈ చిత్రం షూటింగ్‌ మళ్లీ ప్రారంభం కానుంది. మంగళవారం నుంచి హైదరాబాద్‌లో చిత్రీకరణ మొదలు కానుందని తెలిసింది. అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన సెట్‌లో షూటింగ్‌ జరగనుంది. ప్రస్తుతం సినిమాలో కీలక పాత్రధారులపై సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. తదుపరి ఈ నెల 12 నుంచి పవన్‌కల్యాణ్‌ సెట్‌లో అడుగుపెడతారని తెలిసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa