ఆపరేషన్ సిందూర్'పై స్పందించనందుకు బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ విమర్శలు అందుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో సైనికులపై తనకున్న గౌరవాన్ని తెలిపారు. ' కార్గిల్ యుద్ధం గెలిచాక సైనికులను ప్రశంసించడానికి శ్రీనగర్ వెళ్లాను. వారితో 8 రోజులు ఉన్నాను. అలా ఉన్న ఏకైక నటుడిని నేనే. ఒక రాత్రి సరిహద్దు బంకర్‌లో 8 మంది సైనికులతో కలిసి ఉన్నాను' అని ఆమిర్ గుర్తు చేసుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa