మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'కన్నప్ప'. ఈ మూవీని అగ్ర కథానాయకుడు రజనీకాంత్ వీక్షించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ విష్ణు తాజాగా ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. 'రజనీకాంత్ అంకుల్ కన్నప్ప మూవీ చూశారు. సినిమా చూశాక ఆయన నన్ను ప్రేమగా ఆలింగనం చేసుకుని.. కన్నప్ప ఎంతో నచ్చిందని చెప్పారు. ఒక నటుడిగా ఈ క్షణం కోసం నేను 22 ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్నా. ఈ నెల 27న మా సినిమా విడుదల కానుంది' అని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa