ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'సూర్య 45' టైటిల్ టీజర్ విడుదలకి టైమ్ లాక్

cinema |  Suryaa Desk  | Published : Thu, Jun 19, 2025, 06:31 PM

కోలీవుడ్ స్టార్ సూర్య నటించిన చివరి చిత్రం 'రెట్రో' చాలా అంచనాల మధ్య విడుదలైంది. అయితే బాక్సాఫీస్ వద్ద గణనీయమైన ప్రభావం చూపలేకపోయింది. ఈలోగా, సూర్య తన 45వ సినిమా కోసం నటుడి నుండి దర్శకుడిగా మారిన RJ బాలాజీతో జతకట్టాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమా యొక్క టైటిల్ టీజర్ ని జూన్ 20న విడుదల కానుంది. తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ ఈ సినిమా టైటిల్ టీజర్ రేపు ఉదయం 10 గంటలకి విడుదల కానున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు ప్రొడక్షన్ హౌస్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ సినిమాలో త్రిష మహిళా ప్రధాన పాత్రలో నటిస్తుంది. ఈ చిత్రానికి జికె విష్ణు సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌గా నిర్మిస్తున్న ఈ సినిమాకి సాయి అభ్యంకర్‌ సంగీతాన్ని అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa