కస్టమర్‌కి కావాల్సిన సౌకర్యాలను వారు క్లీన్‌గా త్వరగా అందిస్తారనే ఉద్దేశంతో, ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకూడదని సెలబ్రిటీలు బయట ప్రాంతాలకు వెళ్లినప్పుడు పెద్ద పెద్ద స్టార్ హోటల్స్‌లో బస చేస్తుంటారనే సంగతి తెలిసిందే. అయితే కొన్ని సందర్భాల్లో సెలబ్రిటీలకు స్టార్ హోటల్స్ షాకిస్తుంటాయి. ఇలాంటి ఓ ఘటన హీరోయిన్ మీరా చోప్రాకు ఎదురైంది. ఈ అమ్మడు గుజరాత్ అహ్మదాబాద్‌లో డబుల్ ట్రీ హెల్టన్ అనే ఫైవ్ స్టార్ హోటల్లో బస చేసింది. సదరు హోటల్ నుండి ఫుడ్ ఆర్డర్ చేసింది. తీరా వచ్చిన ఫుడ్‌లో తెల్ల పురుగులు ఉండటం చూసి షాకవడం మీరాచోప్రా వంతైంది. వెంటనే దాన్ని వీడియోగా తీసి తన ట్విట్టర్ అకౌంట్‌లో ఫేస్ చేసింది. ఎంతో డబ్బులు చెల్లించి ఇలాంటి హోటల్స్‌లో ఉంటే వారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆమె ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. మీరా చోప్రా పవన్ కల్యాణ్‌తో ‘బంగారం’ సినిమాలో నటించింది.
Staying in @DoubleTree ordered food and got worm in it. @fssaiindia plz have a look. We r paying a bomb to stay in dese places and dey serve us worms in my food. I want some immediate action to be taken on this. Guys lets make this trend and people know!! pic.twitter.com/hGTY6D9ck2
— meera chopra (@MeerraChopra) August 23, 2019
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa