నిఖిల్ కథానాయకుడిగా కొంతకాలం క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'కార్తికేయ', భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సినిమాకి సీక్వెల్ చేయడానికి చందూ - నిఖిల్ రంగంలోకి దిగారు. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన పనులతో ఇద్దరూ బిజీగా వున్నారు. ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం కొంతమంది పేర్లను పరిశీలించారు.
నిఖిల్ పోలిశెట్టి కథానాయకుడిగా నటించిన 'ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ' సినిమా ద్వారా తెలుగు తెరకి శ్రుతి శర్మ పరిచయమైంది. ఆకర్షణీయమైన కళ్లతో తొలి సినిమాతోనే యూత్ హృదయాలను దోచేసిన ఈ అమ్మాయి, మొత్తానికి మంచి ఛాన్సే కొట్టేసింది. 'కార్తీకేయ 2' లో శృతి జర్నలిస్ట్ గా హీరోయిన్ పాత్రలో కనిపించనుందని సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa