గ్లామర్ రంగమైన చిత్రసీ మలో వదంతులనేవి సహజం. అందుకే వాటి గురించి నేను అంతగా పట్టించుకోను అని అం దాల భామ సోనాల్ చౌహాన్ అం టోంది. ఈ రంగం గురించి మా పేరెంట్స్‌కు అంతగా తెలియదు కాబట్టి వాళ్లు వాటి గురించి మనస్తాపం చెందే అవకాశం ఉంది. వాళ్లు బాధపడనంత వరకు నేను వాటి గురించి ఎంత మాత్రం ఆలోచించను అని ఆమె చెప్పుకొ చ్చింది. ఓ వైపు బాలీవుడ్ చిత్రాలు చేస్తూనే దక్షిణాదిలో తెలుగు, తమిళ, కన్నడ సినిమాలలో కూ డా ఆమె నటిస్తోంది. బాలీవుడ్ తర్వాత తెలుగు సినిమాలకు ఆమె ఎక్కువ ప్రాధాన్యమిస్తోంది. ఇప్పటికే టాలీవుడ్‌లో రెయిన్‌బో, పండగ చేస్కో, షేర్, లెజెండ్, డిక్టేటర్ చిత్రాల లో ఆమె నటించింది. తాజాగా బాలకృష్ణ నటిస్తున్న చిత్రంలో ఈ భామ ఓ కథానాయికగా నటిస్తున్నట్లు కొద్దిరోజులుగా వినిపిస్తోంది.
ఇక కెమెరా ముందుకు ఒకసారి వెళ్లిన తర్వాత బయట ప్రాపంచిక విషయాలేవీ తనకు గుర్తుకు రావని….తనకు ఇచ్చిన పాత్రకు సంపూర్ణ న్యాయం చేయడం గురించే ఆలోచిస్తాను. పాత్ర అవసరం, డిమాండ్ వంటి అంశాలను పరిగణలోనికి తీసుకుని బికినీ ధరించడానికి కూడ సిద్ధమే అని ఆమె అంటోంది. నటనతో పాటు సంగీతమన్నా తనకు చెప్ప లేనంత ఇష్టమని చెబుతూ…మనం ఎంత వత్తిడిలో ఉన్నా సంగీతంతో దానిని అధిగమిం చవచ్చునని ఆమె పేర్కొం ది. వాస్తవా నికి సోనాల్ నటి, మోడల్ మాత్రమే కాదు మంచి గాయని కూడా. గతంలో హిందీలో వచ్చిన త్రీజీ సిని మాలో కైసా బతాహో….అనే పాటను కె.కె. అనే గాయకుడితో కలిసి ఆమె పాడిం ది. అవకాశాలు వస్తే పాడాలన్న కోరిక సోనా ల్‌కు మెండుగా ఉంది. అందుకే సంగీతం గురించి ఏదైనా మాట ఆమె ముందు ప్రస్తావిస్తే ఆమెకు దానిపట్ల ఎంత మక్కువో ఎవరికైనా ఇట్టే అర్థమైపోతుంది. ఇప్పుడు ఆమె సంగీతం లో ప్రత్యేకంగా శిక్షణ పొందుతుండటం ఓ విశే షం, చాలామంది తారలు నటిస్తూనే అడపాదడపా అవకాశం కుదిరినపుడు పాటలు పాడుతున్న సంగతి చూస్తున్నదే. ఇకపై సోనాల్‌చౌహాన్ కూడా సంగీతంపై ఎక్కువ దృష్టిని కేంద్రీకరిస్తుందట.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa