బాలీవుడ్ నటి విద్యాబాలన్ రెండు సంవత్సరాల విరామం తర్వాత “మిషన్ మంగల్” సినిమాలో నటించింది. ఈ సినిమా ప్రస్తుతం కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విద్యాబాలన్ మాట్లాడుతూ… తన జీవితంలో చోటుచేసుకున్న చేదు సంఘటనలను గుర్తు చేసుకున్నారు. తల్లిదండ్రులకు బెంగళూరు సొంతూరు కాబట్టి.. కెరీర్ మొదట్లో దక్షిణాదిన హీరోయిన్ గా నటించాలని ప్రయత్నాలు మొదలు పెట్టాను. ఒక తమిళ నిర్మాత ఆయన సినిమా నుండి తనను హీరోయిన్ పాత్ర నుండి తొలగించారు. ఎందుకలా చేశారని తాను నాన్నతో కలిసి అడిగాం. ఆయన ”నన్ను నువ్వు హీరోయిన్ మెటిరియల్ కానేకాదు” అని దారుణంగా అవమానించాడు. కొన్ని నెలలు అద్దంలో నా మొహం చూసుకోవడానికి భయపడ్డాను.
ఎందుకంటే నేను అందంగా లేనని. ఆయనను నా జీవితంలో క్షమించను. కొన్ని రోజుల తరువాత ఒక తమిళ సినిమా ఆఫర్ వచ్చింది. ఆ సినిమాను ఫోన్ లోనే ఒప్పుకున్నాను. సినిమా సెట్‌కు వెళ్లాను, మొదటి రోజు షూటింగ్ అయ్యింది కానీ ఆ నిర్మాత ప్రతీ సరి నా దగ్గరికి వచ్చి జోకులు వేయడం, తనతో ప్రవర్తించిన తీరు తనకు నచ్చలేదు. మరుసటి రోజే సినిమా నుంచి బయటికి వచ్చేయడంతో లీగల్ నోటీస్ పంపారని విద్యా చెప్పింది. అలాగే కెరీర్ తొలి రోజుల్లో చెన్నైలోని ఒక దర్శకుడు తనను రూమ్‌కు రమ్మని పిలిచాడని వెల్లడించింది. ”సినిమా లైన్ చెప్పడానికి ఒక దర్శకుడు నా దగ్గరకు వచ్చాడు. సినిమా పూర్తి కథ చెప్పడానికి కాస్త సమయం కావాలని అడిగాడు. నేను సరే అని చెప్పి.. ఏదైనా కాఫీ షాప్‌లో కలుద్దామని చెప్పా. అందుకు అతను అంగీకరించలేదు. తన రూమ్‌కి రావాలని చెప్పి వెకిలిగా మాట్లాడాడు. దాంతో నాకు కోపం వచ్చి తలుపు తీసి బయటకు పొమ్మన్నాను. అతను నావైపు పైకి కిందకి చూసి వెళ్లిపోయాడని తనకు జరిగిన అనుభవాలను మీడియా ముందు బయటపెట్టింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa