ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'ఈ నగరానికి ఏమైంది' సీక్వెల్‌లో బాల‌కృష్ణ!

cinema |  Suryaa Desk  | Published : Wed, Jul 02, 2025, 03:45 PM

'ఈ నగరానికి ఏమైంది' సీక్వెల్‌ను ద‌ర్శ‌కుడు త‌రుణ్ భాస్క‌ర్ తాజాగా ప్ర‌క‌టించాడు. 'ఈNఈ రిపీట్‌' అనే టైటిల్‌తో ఈ సీక్వెల్ రాబోతుండ‌గా.. విశ్వ‌క్ సేన్, సాయిసుశాంత్‌రెడ్డి, అభినవ్‌ గోమటం, వెంకటేష్‌ కాకుమాను ఈ సీక్వెల్‌లో హంగామా చేయనున్నారు. ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రం యూత్‌లో మంచి గుర్తింపు ఉన్న చిత్రంగా నిలిచిపోయింది. దీని సీక్వెల్ కోసం అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. వారి నిరీక్షణకు తెరదించుతూ తరుణ్ భాస్కర్ ఇటీవల ఈ చిత్రాన్ని ప్రకటించారు. అయితే, ఈ సీక్వెల్‌లో నటసింహం బాలకృష్ణ నటించనున్నారనే వార్త సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. నటుడు విష్వక్సేన్ కు బాలకృష్ణ అంటే విపరీతమైన అభిమానం అన్న సంగతి తెలిసిందే. ఆ అభిమానంతోనే విష్వక్ ఈ సినిమాలో నటించాలని బాలకృష్ణను వ్యక్తిగతంగా కోరగా, ఆయన వెంటనే అంగీకరించినట్లు టాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మొదటి భాగంలో నవ్వులు పూయించిన విష్వక్సేన్, సాయి సుశాంత్ రెడ్డి, అభినవ్ గోమటం, వెంకటేశ్‌ కాకుమాను ఈ సీక్వెల్‌లోనూ తమ పాత్రలను కొనసాగించనున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సురేశ్‌ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై డి. సురేశ్‌ బాబు, సృజన్ యరబోలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మొదటి భాగానికి అద్భుతమైన సంగీతం అందించిన వివేక్ సాగర్ ఈ సీక్వెల్‌కు కూడా స్వరాలు సమకూర్చనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa