ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వినాయకచవితికి "డిస్కో రాజా" టీజర్..?

cinema |  Suryaa Desk  | Published : Wed, Aug 28, 2019, 06:01 PM

మాస్ మహారాజ రవితేజ కథానాయకుడిగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో 'డిస్కోరాజా' తెరకెక్కుతుంది. ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్, నభా నటేశ్ కథానాయికలుగా నటిస్తున్నారు. తమన్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా నుంచి టీజర్ ను వదలడానికి ముహూర్తం ఖరారైనట్టుగా తెలుస్తోంది.


'వినాయక చవితి' పండుగ సందర్భంగా, వచ్చేనెల 2వ తేదీన ఈ సినిమా నుంచి టీజర్ ను వదలనున్నట్టుగా సమాచారం. టీజర్ తోనే సినిమాపై అంచనాలు పెంచే పనిలో దర్శకుడు వీఐ ఆనంద్ వున్నట్టుగా చెప్పుకుంటున్నారు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో నిర్మితమవుతోన్న ఈ సినిమాలో, వెన్నెల కిషోర్, సునీల్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారని అంటున్నారు. కొంతకాలంగా రవితేజ సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఆయన ఆశిస్తోన్న హిట్ ఈ సినిమాతో లభిస్తుందో లేదో చూడాలి. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa