దివంగత నటీ శ్రీదేవి భర్త బోనీకపూర్, జాన్వీ కపూర్‌పై వస్తున్న వార్తలను ఖండించారు. జాన్వీ కపూర్‌కి సౌత్ ఇండస్ట్రీ పట్ల అయిష్టత ఉన్నదని ఆమె సౌత్ హీరోల పక్కన నటించడానికి సుముఖత చూపడం లేదని వస్తున్న వార్తలలో ఎటువంటి నిజం లేదని ఆయన పేర్కొన్నారు. నిజానికి జాన్వీ మంచి స్క్రిప్ట్ ఉంటే కచ్చితంగా సౌత్ చిత్రాలతో నటిస్తారంటూ తేల్చి చెప్పారు. కాగా, త్వరలో సెట్స్‌పైకి వెళ్లనున్న విజయ్ దేవరకొండ, పూరి మూవీలో హీరోయిన్‌గా జాన్వీ నటించనున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఐతే దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన లేకపోయినప్పటికీ ఇండస్ట్రీలో ప్రముఖంగా వినిపిస్తున్న వార్త. ఇదే కనుక నిజం అయితే తెలుగు చిత్రాలతో విడదీయరాని అనుబంధం ఉన్న శ్రీదేవి నటవారసురాలు జాన్వీ నటించే మొదటి సౌత్ మూవీ ఇదే అవుతుంది.
