మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం "సైరా". బాలీవుడ్ గ్రీక్‌గార్డ్ హృతిక్ రోషన్ నటించిన సినిమా "వార్" లు అక్టోబరు 2న విడుదలై థియేటర్ లలో పోటీపడనున్నాయి. అయితే ఈ నేపథ్యంలో గతంలో చిరును ఉద్దేశిస్తూ హృతిక్ మాట్లాడిన వీడియో వైరల్‌గా మారింది. అందులో ‘క్రిష్’.. చిరును ప్రశంసిస్తూ కనిపించారు. ‘నాకు తెలుగు సినిమాలంటే ఇష్టం. అక్కడ ఎంతో శ్రమించి, పనిచేస్తున్న స్టార్స్‌కు నేను అభిమానిని. నా జీవితంలో చాలాసార్లు చిరంజీవి సర్‌ను కలిశాను. ఆయన అద్భుతమైన నటుడు. అంతేకాదు గొప్ప వ్యక్తి. అందరితోనూ ఆయన ప్రేమగా ఉండే తీరు చూసి నేను సర్‌ప్రైజ్ అయ్యాను. చిరు మంచితనం నా హృదయాన్ని తాకింది’ అని అన్నారు.
అనంతరం చిరుతో తనకు ఎదురైన ఓ అనుభవం గురించి వివరిస్తూ.. ‘అప్పుడు ఐఫా వేడుక జరిగింది. అందరు బిగ్ స్టార్స్ వచ్చారు. చిరంజీవి సర్ కూడా వచ్చారు. నా ఆధ్వర్యంలో పార్టీ జరిగింది. అప్పుడు చిరు సర్ అతిథుల దగ్గరికి వెళ్లి, స్వయంగా ఫుడ్ వడ్డించారు. నేను ఆశ్చర్యపోయా, ఆయన మంచితనం నన్ను కట్టిపడేసింది. అందుకే చిరు సర్ అంటే నాకు గౌరవం. టాలీవుడ్‌లోని ఆరోగ్యకరమైన వాతావరణం ఈ ఒక్క ఘటనతో నాకు అర్థమైంది’ అని హృతిక్ చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa