ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్‌గా శేఖర్ కమ్ముల చిత్రం

cinema |  Suryaa Desk  | Published : Wed, Aug 28, 2019, 06:55 PM

నాగచైతన్య హీరోగా శేఖర్ కమ్ముల ఓ చిత్రాన్ని రూపొందించనున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి జూన్‌లోనే పూజా కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. అంతేకాదు జూలై లేదా ఆగష్టులో ఈ మూవీని సెట్స్ మీదకు తీసుకువెళ్లనున్నామని అప్పట్లో చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే కొన్ని కారణాల వలన ఇంతవరకు షూటింగ్ ప్రారంభం కాలేదు. ఇక తాజా సమాచారం ప్రకారం వచ్చే నెల 5 నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఇక రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో చైతూ సరసన సాయి పల్లవి మొదటిసారిగా జత కట్టబోతుంది. అలాగే ఇందులో చైతూ పూర్తి స్థాయి తెలంగాణ యాసలో మాట్లాడబోతున్నట్లు సమాచారం. నారాయణదాస్ నారంగ్, రామ్‌ మోహన్ రావు సంయుక్తంగా మూవీని నిర్మిస్తున్నారు. క్రేజీ కాంబోగా తెరకెక్కుతోన్న ఈ మూవీపై టాలీవుడ్‌లో మంచి అంచనాలు ఉన్నాయి.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa