ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీకార్తీక్ ద‌ర్శ‌క‌త్వంలో శ‌ర్వానంద్ కొత్త చిత్రం

cinema |  Suryaa Desk  | Published : Fri, Aug 30, 2019, 10:51 AM

శ‌ర్వానంద్ హీరోగా ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ఎస్‌.ఆర్‌.ప్ర‌కాశ్ బాబు, ఎస్‌.ఆర్‌.ప్ర‌భు నిర్మాత‌లుగా శ్రీకార్తీక్ ద‌ర్శ‌క‌త్వంలో కొత్త చిత్రం ఈరోజు చెన్నైలో లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. షూటింగ్ కూడా నేటి నుండే ప్రారంభమ‌వుతుంది. ఈ చిత్రంలో `పెళ్ళిచూపులు` ఫేమ్ రీతూవ‌ర్మ హీరోయిన్‌గా న‌టిస్తుంది. నాజ‌ర్‌, వెన్నెల‌కిషోర్‌, ప్రియ‌ద‌ర్శి కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.


విడ‌దీయ‌లేని స్నేహం, ప్రేమ అనే అంశాల ఆధారంగా ఈ సినిమా తెరకెక‌క‌నుంది. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు త‌రుణ్ భాస్క‌ర్ ఈ చిత్రానికి డైలాగ్స్ రాస్తున్నారు. జాక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సుజిత్ సారంత్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. వ‌చ్చే ఏడాది వేస‌విలో సినిమాను విడుద‌ల చేయడానికి నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు.
న‌టీన‌టులు:శ‌ర్వానంద్, రీతూవ‌ర్మ‌, నాజ‌ర్‌, వెన్నెల కిషోర్‌, ప్రియ‌ద‌ర్శి త‌దిత‌రులు, సాంకేతిక వ‌ర్గం: ద‌ర్శ‌క‌త్వం: శ‌్రీకార్తీక్‌, నిర్మాత‌లు: ఎస్‌.ఆర్‌.ప్ర‌కాశ్ బాబు, ఎస్‌.ఆర్‌.ప్ర‌భు,బ్యాన‌ర్‌: డ్రీమ్ , రియ‌ర్ పిక్చ‌ర్స్‌, డైలాగ్స్‌: త‌రుణ్ భాస్క‌ర్‌, మ్యూజిక్‌: జాక్స్ బిజోయ్‌, సినిమాటోగ్ర‌ఫీ: సుజిత్ సారంగ్‌, ఎడిట‌ర్: శ్రీజిత్ సారంగ్‌, ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌: ఎన్‌.స‌తీశ్ కుమార్‌, కాస్ట్యూమ్స్ స్టైలిస్ట్ :ప‌ల్ల‌వి సింగ్‌






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa