ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మా ఇంటిలో సలహాలు ఇవ్వరు..

cinema |  Suryaa Desk  | Published : Fri, Aug 30, 2019, 12:02 PM

చిన్నవాళ్లకు సలహాలు ఇవ్వకూడదు అనేది తమ కుటుంబ నిబంధన అంటోంది యువ తార అతియా శెట్టి. నటుడు సునీల్‌ శెట్టి కూతురైన అతియా…హీరో చిత్రంతో తెరంగేట్రం చేసింది. మిగతా వారసురాళ్లలాగే అతి తక్కువ కాలంలో పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం మోతీచూర్‌, చక్నాచూర్‌ అనే చిత్రంలో నటిస్తోంది. అతియా శెట్టి సోదరుడు అహన్‌ శెట్టి కూడా హీరోగా రాబోతున్నారు. తెలుగులో ఘన విజయం సాధించిన ఆర్‌ఎక్స్‌ 100 చిత్ర బాలీవుడ్‌ రీమేక్‌లో అహన్‌ హీరోగా నటిస్తున్నారు. చిత్ర పరిశ్రమ గురించి తెలిసిన కుటుంబం కాబట్టి…ఈ వారసులకు ఇంట్లో వాళ్లు సలహాలు ఇస్తుంటారని అంతా అనుకుంటారు కానీ…అలాంటిదేం లేదంటోంది అతియా శెట్టి. ఆమె మాట్లాడుతూ..చిన్న వాళ్లకు సలహాలు ఇవ్వడం మా ఇంట్లో నిషేధం. వాళ్లకు ఏదీ చెప్పకూడదు అనేది నిబంధనగా పెట్టుకున్నారు. తమ అనుభవం మీద ఎవరికి వాళ్లు తెలుసుకుంటారు అనే విషయాన్ని కుటుంబమంతా నమ్ముతుంది. అని చెప్పింది. నటిగా కాకుండా ప్రజాహిత కార్యక్రమాల్లోనూ పాల్గొంటోందీ అతియా. ఇటీవల ఓ పర్యావరణ రక్షిత కార్యక్రమంలో పాల్గొన్న అతియా…పర్యావరణాన్ని కాపాడుకుందాం అనే సందేశాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలి. మన వంతు ఎవరికి వారు పర్యావరణ బాగుకోసం పాటుపడాలి. అని తెలిపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa