నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘బిగ్ బాస్ సీజన్ 3 ‘ ఇప్పటీకే 6 వారాలు పూర్తి చేసుకుని 7 వ వారంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటికే హేమ, జాఫర్, తమన్నా సింహాద్రి, రోహిణి, అషూ రెడ్డి వంటి కంటెస్టెంట్లు ఎలిమినేటి అయ్యారు. ఇక ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారా అనేది.. ఆసక్తికరమగా మారింది. ఇదిలా ఉండగా… నాగార్జున తన 60వ పుట్టినరోజు వేడుకలను జరుపుకోవడానికి స్పెయిన్ వెళ్ళారట. అక్కడే ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
అయితే ఈ శనివారం హోస్ట్ గా ఎవరు వస్తారనే సందేహాలు నెలకొన్నాయి. వీకెండ్ ఎపిసోడ్స్ షూటింగ్ శనివారం ఉదయం నుండి రాత్రి వరకూ షూటింగ్ జరుగుతుంటుంది. రెండు రోజులకు సంబంధించిన షూట్‌ను ఒక్క రోజులోనే పూర్తి చేస్తుంటారు నాగ్. ఇప్పుడు నాగార్జున ఇండియాలో లేరు కాబట్టి… ఈ వారం స్పెషల్ గెస్ట్ తో షో హోస్ట్ చేయించాలని నిర్ణయించుకున్నారు ‘బిగ్ బాస్’ టీం. ఈ నేపథ్యంలో మొదట నానితో హోస్ట్ చేయించాలని అనుకున్నారు. కానీ నాని కూడా ఇప్పుడు ఇండియాలో లేరు. దీంతో రమ్యకృష్ణను రంగంలోకి దింపారు. తాజాగా రమ్యకృష్ణ ఎంట్రీ ఇచ్చిన ప్రోమో ని కూడా విడుదల చేశారు. ‘ఇదే నా మాట.. నా మాటే శాశనం’ అంటూ బిగ్ బాస్ షో స్టేజి పై శివగామి (రమ్య కృష్ణ) సందడి మొదలు పెట్టారు. మరి ఈ హోస్ట్ గా ఆమె ఎంతవరకూ ఆకట్టుకుంటుందో చూడాలి..!
The Queen #Sivagami @meramyakrishnan has arrived to #BiggBossTelugu3 as special host
Watch her tonight at 9 PM on @StarMaa pic.twitter.com/iWq7PTyibv
— STAR MAA (@StarMaa) August 31, 2019
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa