మహేష్ బాబు, నమత్రల తనయుడు గౌతమ్ కృష్ణ జన్మదినోత్సవం నేడు. తన కుమారుడు గౌతమ్ టీనేజ్‌లోకి అడుగు పెట్టాడని నమ్రత ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా నమత్ర సోషల్ మీడియా ద్వారా గౌతమ్‌కు బర్త్‌డే విషెస్ అందజేశారు. `గడియారం ముల్లు 12కు చేరగానే నా కొడుకు 13లోకి అడుగు పెట్టాడు. ఇప్పుడు గౌతమ్ టీనేజర్. మహేష్.. గౌతమ్‌కు ఎంతో ఇష్టమైన చాక్లెట్ తినిపించి, ముద్దుపెట్టుకున్నారు. నా కుమారుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. నువ్వు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. లవ్యూ మిస్టర్ గౌతమ్ ఘట్టమనేని` అని నమత్ర సోషల్ మీడియా ద్వారా గౌతమ్‌కు బర్త్‌డే విషెస్ అందజేశారు.