బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఆ వీడియో లో పోతురాజు వేషదారణలో ఉన్న కొంతమంది వ్యక్తులను సల్మాన్ కలిసి వారితో సరదాగా ముచ్చటించటంతో పాటు వారి కొరడాతో తాను కూడా కొట్టుకున్నాడు. సల్మాన్ లాంటి సూపర్ స్టార్ తమతో కొంత సమయం గడపటంతో వారి ఆనందానికి అవధులులేవు. ఈ వీడియోను తన సోషల్ మీడియా పేజ్‌లో పోస్ట్ చేసిన సల్మాన్ ‘వారి అనుభూతుల్ని, బాధను పంచుకోవటం ఆనందంగా ఉండని ఇది మీపై మీరు ప్రయత్నించకండి. మరొకరి మీద కూడా ప్రయోగించకండి’ అంటూ సరదాగా పోస్ట్ చేశాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa