‘మహానటి’,‘రంగస్థలం’ తో పాటు చాలా చిత్రాల్లో సహాయ పాత్రల్లో నటించిన మహేశ్ ఆచంట హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘నేను నా నాగార్జున’. జియన్‌ఆర్ క్రియేషన్స్ పతాకంపై ఆర్.బి.గోపాల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర ట్రైలర్, ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం హీరో నాగార్జున పుట్టినరోజు సందర్భంగా జరిగింది. ఈ చిత్రానికి ఈశ్వర్ పెరావళి సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని సైకిల్ షాపు కుర్రాడి కథతో తెరకెక్కించామని చిత్ర యూనిట్ తెలిపారు. మహేశ్ ఆచంట మాట్లాడుతూ.. మా ఊళ్లో రాంబాబు అని ఓ కుర్రాడుండేవాడు. అతను చేసే పనులన్నీ గుర్తుకొచ్చి, స్ఫూర్తిగా తీసుకుని నటించా. సినిమా ఆద్యంతం ఫన్నీగా సాగుతుంది’’ అని అన్నారు. నిర్మాత గుండపు నాగేశ్వరరావు మాట్లాడుతూ, ఎన్నో ఇబ్బందులను ఓర్చుకుని ఈ చిత్రాన్ని పూర్తి చేశాం. త్వరలోనే మంచి రోజు చూసుకుని విడుదల చేస్తామని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa