లేడీ ఓరియంటెడ్ సినిమా అంటే ఎవరూ ముందుకురారు అని నటి అనుపమ పరమేశ్వరన్ పేరొన్నారు. 'థీమ్ ఆఫ్ పరదా' పాట విడుదల సందర్భంగా గురువారం అనుపమ మాట్లాడుతూ.. "మా సినిమా ఏడాది క్రితమే రెడీ అయింది. పెద్ద సినిమా రిలీజ్ అకారణంగా మాకు థియేటర్లు దొరకలేదు. ఒక అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన సినిమా వస్తుందంటే.. ఎవరూ ముందుకురారు. నిర్మాతలు, ఓటీటీ సంస్థలు, ఒక్కోసారి ఆడియన్స్ కూడా ప్రోత్సహించడానికి ముందుకురారు." అని అన్నారు.