ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కౌసల్య కృష్ణమూర్తి సినిమాపై సింధు కామెంట్

cinema |  Suryaa Desk  | Published : Sun, Sep 01, 2019, 07:01 PM

భీమనేని శ్రీనివాస్‌రావు దర్శకత్వంలో కె.ఎస్‌.రామారావు నిర్మాణ  సారథ్యంలో తెరకెక్కిన చిత్రం "కౌసల్య కృష్ణమూర్తి". అయితే ఈ సినిమాను ప్ర‌పంచ బాడ్మింట‌న్ చాంపియ‌న్ పి.వి.సింధు, కోచ్ పుల్లెల గోపీచంద్, చాముండేశ్వ‌రినాథ్ త‌దిత‌రులు ఈ చిత్రాన్ని శ‌నివారం ప్ర‌త్యేకంగా వీక్షించారు. షో అనంతరం ..


బాడ్మింట‌న్ వ‌రల్డ్ ఛాంపియ‌న్ పి.వి.సింధు మాట్లాడుతూ - ``సినిమా చూశాను. చాలా బావుంది. అమ్మాయిలు బ‌య‌ట‌కొచ్చి వారేంటి? ఎలా నిరూపించుకున్నారు? అన్న అంశాల‌ను ఈ సినిమాలో చూపించారు. మ‌రో ప‌క్క రైతు స‌మ‌స్య‌ల‌ను ఎవ‌రూ పెద్ద‌గా ప‌ట్టించుకోరు? చిన్న‌గానే చూస్తారు. కానీ అలాంటి రైతుల స‌మ‌స్య‌ల‌ను గుర్తించాల‌ని ఈ సినిమాలో చూపించారు. మ‌నం ఈరోజు తింటున్నామంటే కార‌ణం రైతులే. అమ్మాయిలు న‌మ్మ‌కంతో ముందుకొచ్చి క్రికెట్ ఆడ‌టం అనే విష‌యంతో పాటు రైతుల విలువేంటి? అనే మెసేజ్‌ను ఈ చిత్రం ద్వారా ఇచ్చారు. త‌ల్లిదండ్రుల న‌మ్మ‌కాన్ని నిజం చేయ‌డానికి కౌస‌ల్య ఎంత క‌ష్ట‌ప‌డిందో ఈ సినిమాలో మ‌నం చూడొచ్చు. చాలా మంచి మెసేజ్‌, ఎమోష‌న్స్ ఉన్న సినిమా. ఐశ్వ‌ర్యా రాజేష్ చాలా నేచుర‌ల్ న‌టించ‌డ‌మే కాదు.. చాలా హార్డ్‌వ‌ర్క్ చేసింది`` అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa