ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జై సేన’ విజయం ఖాయం : మెగా బ్రదర్ నాగబాబు

cinema |  Suryaa Desk  | Published : Wed, Sep 04, 2019, 12:58 AM


శ్రీకాంత్‌, సునీల్‌ ప్రధాన పాత్రల్లో శ్రీకార్తికేయ, అభిరామ్‌, ప్రవీణ్‌, హరీష్‌ గౌతమ్‌లను పరిచయం చేస్తూ వి.విజయలక్ష్మి సమర్పణలో శివ మహాతేజ ఫిలిమ్స్‌ పతాకంపై వి.సముద్ర దర్శకత్వంలో వి.సాయి అరుణ్‌ కుమార్‌ నిర్మిస్తున్న చిత్రం ‘జై సేన’. చిత్రీకరణ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటోంది. త్వరలోనే సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాకి సంబంధించి ఇటీవల విడుదలైన టీజర్‌కి మంచి స్పందన వచ్చింది. కాగా, ‘మా స్టూడెంట్స్‌ పవరేంటో తెలిపేదే సేన’ అనే టైటిల్‌ సాంగ్‌ను నాగబాబు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు వి.సముద్ర, కో ప్రొడ్యూసర్‌: శిరీష్‌రెడ్డి, హీరోలు శ్రీకార్తికేయ, అభిరామ్‌, ప్రవీణ్‌ పాల్గొన్నారు. ‘హలో మిత్రమా..సేన జై సేన సేన.. మా స్టూడెంట్స్‌ పవరేంటో తెలిపేదే సేన.. యుద్ధం చెరు, యుద్ధం చెరు, యుద్ధం చెరురా..’ అంటూ సాగే ఈ పాటలో ఇండియన్‌ క్రికెట్‌ టీమ్‌ డ్రెస్‌తో, ఆర్మీ యూనిఫాంలో ఉన్న యంగ్‌స్టర్స్‌ కనిపిస్తారు. అలాగే మన జాతీయ జెండాను కూడా ప్రొజెక్ట్‌ చేయడంతో ఈ పాట ఎంతో ఇన్‌స్పైరింగ్‌గా అనిపిస్తోంది. నాగబాబు మాట్లాడుతూ.. శ్రీకాంత్‌, సునీల్‌ ప్రముఖ క్యారెక్టర్స్‌ చేశారు. సాంగ్‌ చూసినపుడు యూత్‌ అండ్‌ పొలిటికల్‌ మూవీ అనిపించింది. ఈ సినిమా మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అన్నారు. 



 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa