ప్రతిష్టాత్మక మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం లో అతిలోక సుందరి శ్రీదేవి మైనపు విగ్రహావిష్కరణ కార్యక్రమం ఈ రోజు అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి బోణి కపూర్, కుమార్తెలు జాన్వీ కపూర్, ఖుషి కపూర్ లు హాజరయ్యారు. శ్రీదేవి, అనిల్ కపూర్ కాంబినేషన్లో 1987లో వచ్చిన 'మిస్టర్ ఇండియా' చిత్రంలోని 'హవా హవాయి' పాట లుక్ ఆధారంగా ఈ విగ్రహాన్ని రూపొందించారు. బంగారు వస్త్రాలను ధరించి, తలపై కిరీటంతో శ్రీదేవి దివి నుంచి భువికి దిగివచ్చిన దేవకన్యలా మెరిసిపోతోంది. ఈ విగ్రహాన్ని చూసిన వారు శ్రీదేవి మళ్లీ వచ్చిందా అన్నట్టు ఉంది అని అంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa