ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చిత్రపురి బాధితులకు అండగా ఉంటా : పవన్ కళ్యాణ్

cinema |  Suryaa Desk  | Published : Wed, Sep 04, 2019, 03:19 PM

అందరికి వినోదాన్ని పంచె సినిమాలో భాగమైనవారికి సొంత ఇంటి కల నెరవేరే క్రమంలో చిత్రపురి కాలనిలో ఎదురవుతున్న సమస్యలపై పోరాటం చేస్తానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ విషయంలో టాలీవుడ్ పెద్దలు ఎన్.శంకర్, పరుచూరి గోపాలకృష్ణ, తమ్మారెడ్డి భరద్వాజలతో తాను మాట్లాడుతానని అన్నారు. ఈరోజు హైదరాబాద్ లోని జనసేన ప్రధాన కార్యాలయానికి వచ్చిన చిత్రపురి సాధన సమితి సభ్యులు.. తమ సమస్యలను పవన్ కల్యాణ్ కు వివరించారు. 


చిత్ర పరిశ్రమలోని 24 విభాగాల్లో తాము పనిచేస్తున్నామనీ, కానీ చిత్రపురిలో ఇతరులకు ప్లాట్స్ దక్కుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఈ విషయమై పోరాడినా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశ్నించినవారికి పని దొరక్కుండా చేసి వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి సమస్యలను సావధానంగా విన్న జనసేనాని.. చిత్రపురిలో తెలుగుసినిమా వారి ఇంటి కల నెరవేరాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. ఈ విషయమై చిత్ర పరిశ్రమలోని పెద్దలు, ఇతరులతో మాట్లాడుతామనీ, జనసేన పార్టీ ఆర్టిస్టులకు అండగా ఉంటుందని పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa