ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డిజిటల్ ఎంట్రీ ఇచ్చేసిన 'తమ్ముడు'

cinema |  Suryaa Desk  | Published : Fri, Aug 01, 2025, 08:10 AM

టాలీవుడ్ నటుడు నితిన్ ప్రధాన పాత్రలో నటించిన 'తమ్ముడు' ఇటీవలే విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద ప్లాప్ గా నిలిచింది. అధిక అంచనాలు ఉన్నప్పటికీ తమ్ముడు బాక్సాఫీస్ వద్ద ప్రభావం చూపడంలో ఫెయిల్ అయ్యింది. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని నెట్‌ఫ్లిక్స్‌ సొంతం చేసుకుంది. తాజాగా ఇప్పుడు ఈ చిత్రం తెలుగు, అలాగే తమిళం, మలయాళం మరియు కన్నడలలో ప్రసారం అవుతుంది. ఈ సినిమాలో సప్తమి గౌడా మహిళా ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రంలో ప్రముఖ నటి లయ, స్వాసికా, వర్ష బోల్లమ్మ మరియు సౌరభ్ సచదేవా కీలక పాత్రల్లో ఉన్నారు. దిల్ రాజు మరియు షిరిష్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతాన్ని అజనీష్ లోక్‌నాథ్ స్వరపరిచారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa