ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15 నుంచి స్ట్రీమింగ్ అవనున్న J.S.K మూవీ

cinema |  Suryaa Desk  | Published : Wed, Aug 06, 2025, 03:44 PM

భారతదేశపు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ అయిన ZEE5, ఈ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా 'J.S.K - జానకి V v/s స్టేట్ ఆఫ్ కేరళ' అనే శక్తివంతమైన లీగల్ డ్రామాను స్ట్రీమింగ్ చేయనుంది. ఆగస్టు 15 నుండి ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళ, కన్నడ, హిందీ భాషలలో అందుబాటులోకి రానుంది. సంక్రాంతికి వస్తున్నం, రాబిన్‌హుడ్, భైరవం వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత ZEE5 తెలుగు అందిస్తున్న మరో గొప్ప చిత్రం ఇది.ప్రవీణ్ నారాయణన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సురేష్ గోపి, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని కాస్మోస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై J. ఫణీంద్ర కుమార్ నిర్మించారు. లైంగిక వేధింపుల నుండి బయటపడిన జానకి విద్యాధరన్ (అనుపమ) న్యాయవాది డేవిడ్ అబెల్ డోనోవన్ (సురేష్ గోపి) సహాయంతో న్యాయం కోసం చేసే పోరాటమే ఈ సినిమా కథ. ఈ పోరాటంలో జానకి విజయం సాధించిందా లేదా అనే అంశాలు ఆసక్తికరంగా ఉంటాయని ట్రైలర్ తెలియజేస్తోంది. గిరీష్ నారాయణన్ స్వరపరిచిన పాటలు, గిబ్రాన్ నేపథ్య సంగీతం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. రెనదివే సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి మరింత బలం చేకూర్చింది. ఉత్కంఠభరితమైన ఈ కోర్టు డ్రామాను ఆగస్టు 15న ZEE5లో వీక్షించి స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఎంజాయ్ చేయవచ్చని సంస్థ తెలిపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa