ఐశ్వర్య రాయ్ఐశ్వర్య రాయ్చిరంజీవి 151వ సినిమాగా 'ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి' సినిమాను తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. చారిత్రక నేపథ్యంతో కూడిన కథ కావడం వలన, దర్శకుడు సురేందర్ రెడ్డి అన్ని విషయాల్లోను జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. జాతీయ స్థాయిలో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచన ఉన్నందు వలన, బాలీవుడ్ హీరోయిన్ ను తీసుకోవాలనుకున్నారు.ఐశ్వర్య రాయ్ అయితే బాగుంటుందని భావించి ఆమెను సంప్రదించారట. కథను కూడా ఆమెకి వివరించారు. చిరంజీవి సరసన నటించడానికి ఆసక్తిని కనబరిచిన ఐశ్వర్య రాయ్, పారితోషికంగా 9 కోట్లను డిమాండ్ చేసిందట. అయితే పారితోషికాన్ని తగ్గించమనే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని అంటున్నారు. భారీ పారితోషికాన్నిఆమె డిమాండ్ చేయలేదనేది యూనిట్ వర్గాల మాట.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa