ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'సు ఫ్రామ్ సో' డిజిటల్ ఎంట్రీ అప్పుడేనా

cinema |  Suryaa Desk  | Published : Tue, Aug 26, 2025, 08:55 PM

ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్ కన్నడ హిట్ సినిమా 'సు ఫ్రామ్ సో' ఆగష్టు 8న తెలుగులో గ్రాండ్ గా విడుదల చేసింది. ఈ సినిమాకి తెలుగురాష్ట్రాలలో విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ రెస్పాన్స్ లభిస్తుంది. ఈ సినిమా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని జియో హాట్స్టార్ సొంతం చేసుకుంది. తాజాగా ఇప్పుడు లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ చిత్రం సెప్టెంబర్ 5న స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రంలో షానెల్ గౌతమ్, జె.పి. తుమినాడ్, సంధ్య అరాకేరే, ప్రకాష్ తుమినాడ్, దీపక్ రాయ్ పనాజే, మరియు మైమ్ రామ్‌దాస్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. లైట్ బుద్ధ ఫిలిం బ్యానర్ కింద రాజ్ బి శెట్టి ఈ సినిమాని నిర్మించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa