అల్లు అర్జున్ హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్ గా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'అల వైకుంఠపురములో'. ఈ చిత్రం ఇప్పటికే కొంతవరకూ చిత్రీకరణను జరుపుకుంది. ముందుగా ప్లాన్ చేసుకున్న ప్రకారం ఈ సినిమా షూటింగ్ చకచకా జరిగిపోతోంది. త్రివిక్రమ్ పుట్టినరోజైన నవంబర్ 7వ తేదీన ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేయాలని భావించారు. కానీ తాజాగా ఆ ఆలోచనను విరమించుకున్నారట. దసరా పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని అక్టోబర్ 8వ తేదీన టీజర్ ను వదలాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా సమాచారం. ఒక నెల ముందుగానే టీజర్ ను వదలనుండటం బన్నీ అభిమానులకు ఆనందాన్ని కలిగించే విషయం. గీతా ఆర్ట్స్ - హారిక అండ్ హాసిని వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. సంక్రాంతికి విడుదల చేసే ఈ సినిమాలో 'టబు' కీలక పాత్రలో కనిపించనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa