మెగాస్టార్ చిరంజీవి హీరోగా, తన కెరియర్లోనే అత్యంత ప్రతిష్ఠాత్మక చిత్రంగా 'సైరా' చిత్రం రూపొందింది. చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తోన్న ఈ సినిమాను అక్టోబర్ 2వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేశారు. నరసింహా రెడ్డి కర్నూల్ జిల్లా 'రేనాడు' ప్రాంతానికి చెందినవాడు. అందువలన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కర్నూల్లో జరపాలని అనుకున్నారు. అయితే ఈ వేడుకకి రానున్న ప్రముఖులందరికీ ప్రయాణం .. 'బస' పరంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు వున్నాయి. అందువలన హైదరాబాదులోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చేశారనేది తాజా సమాచారం. ఏ రోజున ఈ వేడుకను జరపనున్నారు? .. వేదిక ఎక్కడ? అనే విషయాలను రెండు రోజుల్లో తెలియపరచనున్నారు. నయనతార కథానాయికగా నటించిన ఈ సినిమాలో, ఒక ప్రత్యేకమైన పాత్రలో తమన్నా కనిపించనున్న సంగతి తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa