ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దబంగ్‌ 3 ఫస్ట్‌లుక్‌ విడుదల

cinema |  Suryaa Desk  | Published : Fri, Sep 13, 2019, 07:36 AM

సల్మాన్‌ ఖాన్‌ హీరో రూపొందిన దబంగ్‌ బాక్సాఫీస్‌ వద్ద కోట్లు కొల్లగొట్టింది. ఈ ప్రాంచైజ్‌లో ఇప్పుడు మూడో చిత్రంగా దబంగ్‌ 3 రాబోతుంది. వాంటెడ్‌ చిత్రం తర్వాత ఈ సినిమా కోసం దర్శకుడు ప్రభుదేవా, సల్మాన్‌ కలిసి పని చేస్తున్నారు. ఈ చిత్రంలో మరోసారి చుల్‌బుల్‌ పాండేగా సల్మాన్‌ ప్రేక్షకులను అలరించబోతున్నాడు. ఈ సినిమా మొదటి మోషన్‌ పోస్టర్‌ను చిత్రయూనిట్‌ విడుదల చేసింది. చుల్‌బుల్‌ పాండేగా ఉన్న ఈ పోస్టర్‌ను తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేశారు. దబంగ్‌ ప్రాంచైజీలో తొలిసారిగా బహుభాషా చిత్రంగా మూడో భాగం మాత్రమే రూపొందుతోంది. ఈ చిత్రాన్ని పాన్‌ఇండియా మూవీగా తెరకెక్కించబోతున్నారు. ఇటు ప్రభుదేవా, అటు సల్మాన్‌ ఖాన్‌ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa