వివాదాస్పద పాత్రలవైపూ తెగింపుగా అడుగులేసే గట్స్ అమలాపాల్ సొంతం. ఇటీవలే వచ్చిన ఆమె గొప్ప ఫలితం సాధించుకున్న తనను పోషించిన న్యూడ్ పాత్రలో సంచలనమే సృష్టించింది అమలాపాల్. అయితే కెరీర్ ఆరంభంలో తెలుగు, తమిళ భాషల్లో వెలుగు వెలిగిన బ్యూటీకి ఇటీవల తెలుగులో అవకాశాలు పూర్తిగా సన్నగిల్లాయి. అదే సమయంలో వ్యక్తిగత సమస్యల్లోనూ అమల కూరుకుపోవడంతో ఇక ఆమెకు అవకాశాలు కష్టమేనన్న నిర్ణయానికి వచ్చేశారు. దీంతో తమిళంలో మాత్రం సినిమాలు చేసుకుంటూ వెళ్తోంది అమలాపాల్. నటనకు అవకాశమున్న పాత్రలే చేస్తున్న అమలకు, తాజాగా తెలుగునుంచి ఓ గ్లామర్ ఆఫర్ అందినట్టు తెలుస్తోంది. ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వంలో రాజశేఖర్ కొత్త చిత్రం అక్టోబర్‌లో సెట్స్‌పైకి వెళ్లనుండటం తెలిసిందే. ఈ కొత్త ప్రాజెక్టులో రాజశేఖర్‌కు జోడీగా అమలాపాల్‌ను ఎంపిక చేసుకున్నట్టు సమాచారం.