అందాల రాక్షసి అనుష్క బాగమతి అనంతరం నటించిన నిశ్శబ్దం ఫస్ట్ లుక్ ఊరించి ఊరించి ఎట్టకేలకు విడుదల చేశారు. బాహుబలి-ది కన్‌క్లూజన్, బాగమతి బ్లాక్‌బస్టర్స్ తరువాత అనుష్క నటించిన చిత్రం కావడంతో ఈ చిత్రానికి చాలా క్రేజ్ ఏర్పడింది. దానిని ముందే ఊహించి ఈ చిత్రాన్ని ఏకంగా ఏకకాలంలో అయిదు భాషల్లో రూపొందిస్తున్నారు. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని టి.జి.విశ్వప్రసాద్-కోన వెంకట్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అనుష్క మూగ యువతిగా నటిస్తుండడం విశేషం.