నటి కీర్తి సురేష్ రీసెంట్ గా ఓనం పండుగను జరుపుకోవడమే కాకుండా అందరికీ ఓనం శుభాకాంక్షలు తెలిపింది. ఈ సందర్భంగా క్రీమ్ కలర్ చీర గ్రీన్ కలర్ బ్లౌజ్ ధరించి నవ్వులు రువ్వుతూ ఉన్న ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానుల కోసం షేర్ చేసింది. ఈ ఫోటోల్లో తలలో పూలు తురుముకొని.. చేతులకు గాజులు.. నుదుటిన బొట్టుతో పూర్తిగా ట్రెడిషనల్ లుక్ లో కనిపిస్తోంది. కీర్తి గతంలో కాస్త చబ్బీగా కనిపించేది కానీ ఇప్పుడు స్లిమ్ లుక్ లోకి మారిపోయింది. చీరకట్టులో కూడా నాజూకుగా కనిపిస్తోంది. ఫేస్ లో కూడా ఆ మార్పు తెలుస్తోంది. మరో ఫోటోలో కీర్తి తన అమ్మగారు మేనక సురేష్ తో కలిసి పోజిచ్చింది. ఈ ఫోటోలకు స్పందనగా చాలామంది నెటిజన్లు కీర్తికి ఓనం శుభాకాంక్షలు తెలిపారు. “రియల్ కేరళయిజం”.. “నీ క్యూట్ చబ్బీ ఫేస్ ను మిస్ అవుతున్నా”.. “ట్రెడిషనల్ లుక్ భలే ఉంది”.. అంటూ తమ స్పందనలు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa