వరుణ్ తేజ్ హీరోగా, హరీశ్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన వాల్మీకి చిత్రం టైటిల్ వివాదాస్పదం కావడం తెలిసిందే. వాల్మీకి టైటిల్ మార్చాల్సిందేని బోయ హక్కుల పోరాట సమితి పోరాటం కొనసాగిస్తోంది. దీనిపై వారు హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేయగా, తాజాగా ఆ పిటిషన్ పై విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలో, హైకోర్టు వాల్మీకి హీరో వరుణ్ తేజ్ తో పాటు, చిత్ర యూనిట్ కు, రాష్ట్ర డీజీపీకి, సెన్సార్ బోర్డుకు, ఫిలించాంబర్ కు నోటీసులు జారీ చేసింది. 4 వారాల్లో ఈ వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణ మరో నెలరోజుల తర్వాత ఉంటుందని పేర్కొంది. ఈ సినిమా సెప్టెంబరు 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే వాల్మీకి చిత్రం ట్రైలర్ కు విశేష స్పందన వచ్చింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa