by Suryaa Desk | Wed, Oct 02, 2024, 09:32 PM
తీవ్ర కడుపునొప్పితో ఆసుపత్రిలో చేరిన రజనీకాంత్‌కు సర్జరీ పూర్తయినట్లు తెలుస్తోంది. మంగళవారం ఉదయం వైద్యులు ఆయన పొత్తికడుపులో స్టెంట్ వేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. మరో మూడు రోజుల్లో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. రజనీ ఆరోగ్యంపై ఆయన భార్య లతా స్పందించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని చెప్పారు. రజనీకాంత్ ఆసుపత్రిలో చేరినట్లు వార్తలు రావడంతో అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఆయన క్షేమంగా ఉన్నారని తెలియడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు. తలైవా త్వరగా కోలుకోవాలని అభిమానులంతా పార్థిస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్‌లు పెడుతున్నారు. ప్రస్తుతం రజనీకాంత్ ‘వేట్టయాన్’, ‘కూలీ’ సినిమాల్లో నటిస్తున్నారు. ‘వేట్టయాన్’ అక్టోబర్ 10న విడుదలకానుంది. ఇటీవల జరిగిన సినిమా ఆడియో వేడుకలో రజనీ పాల్గొన్నారు. అనిరుధ్‌తో కలిసి సరదాగా స్టెప్పులు వేశారు.
Latest News