by Suryaa Desk | Thu, Oct 03, 2024, 02:22 PM
ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన ‘దేవర’ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ టాక్‌తో దూసుకుపోతోంది. ప్రీ సేల్ బుకింగ్స్‌లోనే హవా కొనసాగించిన ‘దేవర’ విడుదలయ్యాక కూడా మంచి కలెక్షన్లు సొంతం చేసుకుంటోంది. ఇప్పటివరకు రూ.396 కోట్లు వసూలు చేసింది. ఈ విషయాన్ని తెలుపుతూ చిత్రబృందం తాజాగా ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన జాన్వీకపూర్ అలరించగా, విలన్‌గా సైఫ్ అలీఖాన్ కనిపించార
తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?
రెండు తెలుగు రాష్ట్రాల్లో ‘దేవర: పార్ట్ 1’ రూ.170 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసింది. ఇందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ రూ.120 కోట్ల వరకు ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ‘దేవర: పార్ట్ 1’ హక్కులు రూ.115 కోట్లకు అమ్ముడుపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే ‘దేవర’ రూ.ఐదు కోట్లు లాభం సంపాదించింది. అయితే తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి. అంతే కాకుండా చెప్పుకోదగ్గ మరో పెద్ద సినిమా కూడా లేదు కాబట్టి మరో రెండు వారాలు ఈ సినిమాకు ఫ్రీ రన్ లభించనుంది.
ఫుల్ రన్లో ఎంత వసూలు చేయవచ్చు?
ఈ సినిమా ఫుల్ రన్లో రూ.500 కోట్ల వరకు వసూలు చేయవచ్చని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా కర్ణాటక, హిందీ, ఓవర్సీస్ ఏరియాల్లో ‘దేవర: పార్ట్ 1’ మంచి హోల్డ్‌ను ప్రదర్శిస్తుంది. కాబట్టి ఫుల్ రన్లో భారీ వసూళ్లు సాధించే అవకాశం ఉంది.
Latest News