by Suryaa Desk | Wed, Nov 20, 2024, 03:41 PM
స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీని ఏలిన సమంత ప్రస్తుతం బాలీవుడ్ లోనే స్థిరపడిపోయినట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఖుషి సినిమా తర్వాత మళ్లీ తెలుగు సినిమాల్లో కనిపించడం లేదు.అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ తన కెరీర్ మొదట్లో ఎదుర్కొన్న ఎన్నో అనుభవాలను ఇప్పటికే ఎన్నో ఇంటర్వ్యూలలో పాల్గొన్న సమయంలో బయట పెట్టింది.అయితే చాలామంది సెలబ్రిటీలు చిన్న తనంలో ఎలా ఉండేవారో చెబుతూ అందరిని ఆశ్చర్యపరుస్తూ ఉంటారు.అయితే తాజాగా సమంతకి సంబంధించిన అలాంటి విషయం ఒకటి వైరల్ అవుతుంది. అదేంటంటే సమంత అర్ధరాత్రి ఎంజాయ్ చేయడం కోసం బామ్మ అడ్డుగా ఉందని ఆమెకు స్లీపింగ్ పిల్స్ ఇచ్చి ఇంట్లో నుండి చెక్కేసిందట. ఇక అసలు విషయంలోకి వెళ్తే.. యాంకర్ ప్రదీప్ మాచిరాజు యాంకరింగ్ చేసిన కొంచెం టచ్ లో ఉంటే చెప్తా అనే షో అప్పట్లో ఒక ఊపు ఊపింది.
అయితే ఈ షోకి వచ్చిన సమంత తాను చేసిన ఒక చెత్త పని గురించి చెబుతూ నేను చిన్నప్పటినుండే గ్యాంగ్ మెయింటైన్ చేసేదాన్ని. అలా మా గ్యాంగ్ ముందు ఓ ఫ్రెండ్ వచ్చి నేను పబ్ కి వెళ్లాను చాలా ఎంజాయ్ చేశాను అని గొప్పలు చెప్పుకుంది. దాంతో ఎలాగైనా సరే మేము కూడా పబ్ కి వెళ్లాలని నిర్ణయించుకున్నాం. అయితే ఓ రోజు రాత్రి మా పేరెంట్స్ ఊరెళ్ళాక మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాము.అయితే అక్కడ వాళ్ళ పేరెంట్స్ కూడా ఇంట్లో లేరు.కానీ వాళ్ళ బామ్మ ఉంది.అయితే బామ్మ ఎంతసేపైనా పడుకోకపోవడంతో పాలల్లో స్లీపింగ్ పిల్స్ వేసి ఇచ్చాము. దాంతో ఆ పాలు తాగి బామ్మ తెల్లవారుజాము దాకా పడుకుంది. ఆ తర్వాత మేము పబ్ కి వెళ్లి ఎంజాయ్ చేసాము.కానీ నా జీవితంలో చేసిన చెత్త పని ఇదే.మేము చేసినట్టు ఎవరు చేయకండి అంటూ సమంత ఆ షోలో చెప్పుకుంది
Latest News