మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని సీఐటీయు రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు పీ. రమ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బుధవారం ఖమ్మం కలెక్టరేట్ లో జిల్లా విద్యాశాఖ అధికారికి వినతిపత్రం అందజేశారు. గత ప్రభుత్వంలో ప్రారంభించిన అల్పాహారం బిల్లులు కూడా పెండింగ్‌లో ఉన్నాయన్నారు. మధ్యాహ్న భోజన కార్మికులకు పీఎఫ్, ఈఎస్‌ఐ సౌకర్యం కల్పించాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa