జోగులాంబ గద్వాల జిల్లాలో ఎండలు దంచికొడుతున్నాయి. ఏప్రిల్ మాసం ప్రారంభం కావడంతో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. గురువారం గద్వాల, అయిజ పట్టణాలలో ఏకంగా 43. 2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జిల్లాలోని అన్ని మండలాల్లోనూ 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవడంతో అధికారులు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు. ఎండలు తీవ్రమవడంతో బయట సంచరించే ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని డీఎంహెచ్ఓ శశికళ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa